వైయస్‌ఆర్‌సీపీలోకి మాజీ సీఎం త‌నయుడు

–వచ్చే నెల 8న రాంకుమార్‌రెడ్డి వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో చేరిక‌
 విశాఖ‌:  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎం, దివంగత నేత నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి తనయుడు రాంకుమార్‌ రెడ్డి వైయస్‌ఆర్‌ సీపీలోకి చేరుతున్నట్లు ప్రకటించారు. వచ్చేనెల 8వ తేదీన వేలాది మంది అభిమానులతో వైయ‌స్ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌లోకి చేరుతానని రాంకుమార్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి కొత్త దిశనిర్దేశం కావాలని ఆ పటిమ వైయ‌స్ జగన్‌లో ఉంద‌న్నారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నాటి సంక్షేమ పాల‌న మ‌ళ్లీ రావాలంటే వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావాల్సిందే అన్నారు. జ‌గ‌న‌న్న‌ను ముఖ్య‌మంత్రిని చేసేందుకు తాను వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్న‌ట్లు రాంకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. త‌న అనుచరుల‌తో క‌లిసి వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న వెల్ల‌డించారు. 
Back to Top