ప్రత్యేక రాజధాని అడగడం సిగ్గుచేటు: భూమా

కర్నూలు 08 ఆగస్టు 2013:

పదవులు పట్టుకుని వేలాడుతున్న సీమాంధ్ర నేతల ఇళ్లను ముట్టడించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి నేతలకు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి  ప్రత్యేక రాజధాని అడగటం సిగ్గు చేటని ఆయన మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలు చేయడానికైనా అందరూ సిద్ధపడాలని భూమా నాగిరెడ్డి  తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ధర్నాలు చేయటం సిగ్గుచేటని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి విమర్శించారు. ఎమ్మిగనూరులో చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలకు దిగారు. మరోవైపు రాష్ట్ర విభజనను నిరసిస్తూ కర్నూలులో వందమంది యువకులు కొండారెడ్డి బురుజు ఎక్కారు. మరోవైపు సమైక్యాంధ్రాకు మద్దతుగా ఆళ్లగడ్డ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

Back to Top