వైయస్సార్సీపీలోకి సీనియర్ నేత

కర్నూలు(ఆళ్లగడ్డ): బీజేపీ నేత, ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బోరెడ్డి లక్ష్మిరెడ్డి వైయస్సార్సీపీలో చేరనున్నారు. మండల కన్వీనర్లు, ఇతర నాయకులతో కలిసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈమేరకు స్థానిక కార్యాలయంలో  లక్ష్మిరెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈనెల 14వ తేదీన విజయవాడలో జరగనున్న కో –ఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు లక్ష్మిరెడ్డి ప్రకటించారు.

Back to Top