కూలికి కాదు ...పాపను స్కూల్ కు పంపమ్మా

గోపాలపురం :  బడికి వెళ్లాల్సిన వయసులో
కూలి పనులకు వెళుతున్న పాపను చూసిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఆపాపను పాఠశాలలో చేర్పించాలంటూ
తల్లికి సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని మారంపల్లిలో ప్రజా
సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ స్థానికులతో మాట్లాడుతూ వారి సమస్యలను
తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తల్లితో
పాటు పొలం పనులకు వెళుతున్న ఒక చిన్నారిని చూసి, ఆమెతో మాట్లాడారు. చదువుకోవాలని
ఉందా అంటూ ఆ పాపతో ముచ్చటించారు. తరువాత పాప తల్లితో మాట్లాడుతూ , చిన్నారి ఉన్నత
చదువులను చదివి పైకి రావాలంటే పొలం పనులకు కాకుండా బడికి పంపాలని సూచించారు.
అధికారంలోకి వస్తే పిల్లల చదువు భారం కాకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు
అందించడానికి చేపట్టనున్న కార్యక్రమాలను ఆమెకు జగన్ ను వివరించారు.తాజా ఫోటోలు

Back to Top