బాబు ఆదేశాలతోనే అమ్మకానికి పెట్టారుః ధర్మాన

హైదరాబాద్ః సదావర్తి సత్రం భూములను చంద్రబాబు ఆదేశాలతోనే అమ్మకానికి పెట్టారని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. వందలాది కోట్ల విలువ చేసే సదావర్తి భూములను టీడీపీ తమ వారికి కారుచౌకగా ధారదత్తం చేసిన నేపథ్యంలో... వాస్తవాలను తెలుసుకునేందుకు, వైయస్సార్సీపీ ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నిజనిర్ధారణ కమిటీ నియమించిన తెలిసిందే. ఈకమిటీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ కు నివేదిక అందజేసింది. సదావర్తి సత్రం భూములు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆస్తి అని ధర్మాన పేర్కొన్నారు. అలాంటి వాటిని కేబినెట్ దృష్టికి, గవర్నర్ దృష్టికి తీసుకురావాల్సి ఉండగా...ఎవరికీ తెలియకుండా చంద్రబాబు ఆవిషయాన్ని దాచిపెట్టి భూమలను అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. హైదరాబాద్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడారు. తక్షణమే ఆక్షన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

Back to Top