స్వలాభం తప్ప రాష్ట్రాభివృద్ధే పట్టడం లేదు

హైదరాబాద్ః  ఏపీ ఎడారిగా మారుతున్నా బాబుకు చీమకుట్టినట్టైనా లేదని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఏ కార్యక్రమం చేపట్టినా బాబు తన స్వలాభం చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయడం లేదని దుయ్యబట్టారు. చంద్రన్న పథకాలు, చంద్రన్న భవనాల పేరుతో బాబు హడావుడి చేయడం వినడానికే అసహ్యంగా ఉందని ఎద్దేవా చేశారు. బాబుకు ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేయాలన్న చిత్థశుద్ధే లేదని బొత్స ఫైరయ్యారు. రాజకీయ లబ్ధి కోసం ప్రకటనలకే పరిమితం కాకుండా నిజాయితీ పనిచేయాలని బాబుకు హితవు పలికారు. తుఫాన్  దృష్ట్యా ప్రజల ప్రాణ, ధనాన్ని కాపాడేవిధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

To read this article in English: http://bit.ly/1TrchJi

Back to Top