ఆంధ్రుల ఆత్మగౌరవం తాకట్టు

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి అన్నారు.  విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్రెడ్డి విలేకర్లలో మాట్లాడారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలతో  తెలుగు ప్రజలంతా బాధాతప్త హృదయాలతో ఉన్నారని చెప్పారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాలకింద తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ మేకపాట రాజమోహనరెడ్డి సారథ్యంలో శుక్రవారం రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి రైల్వేజోన్పై ఒత్తిడి తీసుకొస్తామని కొయ్య ప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు.
Back to Top