మిథున్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గిస్తూ ప్రభుత్వం కుట్ర

చిత్తూరుః  వైయస్సార్ సీపీపై అధికారపార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అక్రమ కేసులు, ప్రలోభాలు, ఆఖరికి గన్ మెన్ లను కూడా తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం పైశాచికంగా ప్రవర్తిస్తోంది.  రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డికి సెక్యూరిటీ తగ్గించారు. ఇంతకుముందు 2+2 ఉన్న సెక్యూరిటీని 1+1కు తగ్గించారు. ఐతే,  అధికార  పార్టీ ఎంపీలకు మాత్రం 2+2 సెక్యూరిటీని కొనసాగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే  ఏ చట్ట సభలకు ప్రాతినిథ్యం వహించని టీడీపీ నేత బద్రీ నారాయణకు(చిత్తూరు ఎమ్మెల్యేకు బంధువు) సెక్యూరిటీని కొనసాగించడంపై సర్వత్రా మండిపడుతున్నారు. దీనిపై ఎంపీ మిథున్‌రెడ్డి స్పందిస్తూ.... సెక్యూరిటీ తగ్గిస్తే భయపడతానని టీడీపీ నేతలు భావిస్తున్నారనీ,  భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Back to Top