మంత్రులను కాపాడే ప్రయత్నం

ఏపీ అసెంబ్లీ: పేపర్‌ లీకేజీకి బాధ్యులైన మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలను ముఖ్యమంత్రి కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. లీకేజీ విషయంలో టీడీపీ నేతలు తప్పు చేశారు. ఒక మంత్రి లీకేజ్‌ కాదు అంటున్నారు. మరొకరు మాల్‌ ప్రాక్టిస్‌ అంటున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా?  దీనిపై చర్చించి వారి సచ్చిలతను నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. సీఎం ఎందుకు మంత్రులకు కొమ్ము కాస్తున్నారని నిలదీశారు. నారాయణ, గంటాలను ఎందుకు వెనుకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. విద్యాశాఖ పేరు మార్చిన విధి విధానాల్లో మార్పు రాలేదన్నారు. నాలుగు జిల్లాల్లో పేపర్లు లీకేజీ అయ్యాయి. వీటన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. అర్హత లేని వారికందరికి ర్యాంకులు ఇస్తున్నారు. ఇలా అడ్డదారిలో ర్యాంకులు అంటగట్టి కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులను శిక్షించేవరకు ఆందోళన ఆగదు.  ఆగ్రిగోల్డు, కరువు, లీకేజీపై చర్చించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. సభలో ఇప్పటికే ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం పొందారు. లీకేజీపై సీబీఐ విచారణ నిర్వహించాల్సిందే అని సురేష్‌ డిమాండ్‌ చేశారు.

Back to Top