జగనన్నకు 'గెలుపు'ల బహుమతి

పాలకొండ :

స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, సాధారణ ఎన్నికలలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాలవలస రాజశేఖరం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకొండలో జరిగిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగానికి ముందు పాలవలస ఉద్వేగంగా ప్రసంగించారు. అధికార కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కై వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయన్నారు.‌ మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ, జంపరకోట రిజర్వాయర్, పాలకొండలో జిల్లా కేంద్ర ఆసుపత్రి ఏర్పాటు, ఏనుగుల సమస్య వంటి‌ వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని, శ్రీ జగన్ ‌సిఎం అయ్యాకే ఇవన్నీ చక్కబడతాయని భరోసా ఇచ్చారు.

‌శ్రీ వైయస్‌ జగన్ ని‌ర్దోషిగా త్వరలోనే బయటకొస్తారని, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ అన్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గం నాయకురాలు కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. శ్రీమతి షర్మిల చారిత్రక పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాతో మూడు వేల కిలోమీటర్లు పూర్తికావడం సంతోషదాయకమన్నారు. పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ.. తన మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో శ్రీ జగన్మోహన్‌రెడ్డి లాంటి గొప్ప నాయకుడిని చూడలేదన్నారు. మరో సమన్వయకర్త విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ శ్రీమతి షర్మిల అడుగుజాడలు ఆదర్శమని, రాజన్నరాజ్యం రావాలంటే జగనన్నను సిఎంను చేయాలని పిలుపునిచ్చారు.

బహిరంగ సభ అనంతరం పాలకొండ పట్టణ వీధుల్లో శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగింది. అనంతరం ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని బూర్జ మండలం డొంకలపర్తిలో ఆమె ప్రవేశించారు. అక్కడ ప్రజలు శ్రీమతి షర్మిలను ఆత్మీయంగా ఆహ్వానించారు. డొంకలపర్తిలోనే మంగళవారం రాత్రికి శ్రీమతి షర్మిల బస చేశారు.

Back to Top