ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా వైఎస్సార్సీపీ వాకౌట్ ప్ర‌య‌త్నం, స‌భ వాయిదా

హైద‌రాబాద్‌) ప్ర‌త్యేక అభివృద్ధి నిధికి సంబంధించి ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీ వాకౌట్ ప్ర‌తిపాదించింది. ఎస్ డీ ఎఫ్ అనే పేరుతో టీడీపీ నేత‌ల‌కు దోచిపెట్ట‌డానికి నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మాట్లాడ‌టానికి ప్ర‌య‌త్నించారు. అయితే దానికి స్పీక‌ర్ కోడె ల శివ‌ప్ర‌సాద్ అడ్డు త‌గిలారు. టీడీపీ నేత‌ల పేర్లు చ‌దివి వినిపించ‌టానికి ఆయ‌న అంగీక‌రించ‌లేదు. మైక్ క‌ట్ చేశారు. దీని మీద ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నిర‌స‌న తెలిపారు. టీడీపీ స‌భ్యుడు శ్ర‌వ‌ణ్ కుమార్ కు మైక్ ఇచ్చారు. దీనికి ప్ర‌తిపక్ష వైఎస్సార్సీపీ నిర‌స‌న తెలిపింది. మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్ కుమైక్ ఇచ్చిన‌ట్లే ఇచ్చి మ‌ళ్లీ క‌ట్ చేశారు. దీనికి వైఎస్సార్సీపీ నిర‌స‌న తెలిపింది. ఈ గంద‌ర‌గోళం మ‌ధ్య స‌భ వాయిదా ప‌డింది. 
Back to Top