15 ఏళ్ల పాటు ప్రత్యేకహోదా ఇవ్వాలి

న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ శుక్రవారం లోక్‌సభలో ఆయన ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. పునర్‌ విభజన చట్టాన్ని సవరించి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ బిల్లులో ప్రతిపాదించారు. ఎక్సైజ్‌ డ్యూటీ, ఆదాయ పన్ను, కార్పొరేటు వర్కుల్లో రాయితీ కల్పించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. వర్కింగ్‌ కేపిటల్‌లో పరిశ్రమలకు 40 శాతం సబ్సిడీ ఇవ్వాలని ఎంపీ కోరారు.

Back to Top