హోదా ఒక్కటే వైయస్‌ఆర్‌ సీపీ మాట.. బాట


కేసులకు భయపడి ఢిల్లీకి వస్తున్నారేమో
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి ఒకే మాట.. ఒకే బాటపై నడుస్తుందని పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో వెనకడుగు వేయకుండా పోరాటం చేస్తున్నామన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనపై కేసులు పెడుతుందనే భయంతో ఢిల్లీకి వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు నిజంగా హోదాపై చిత్తశుద్ధి ఉంటే తన ఎంపీలతో రాజీనామాలు చేయించాలని కోరారు. హోదా సాధించే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం ఆగదని, పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా పడిన వెంటనే పార్టీ ఎంపీలమంతా రాజీనామాలు చేసి ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామన్నారు. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి వైయస్‌ఆర్‌ సీపీతో కలిసి వస్తే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందన్నారు. 
Back to Top