వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన స్కూల్ మిత్రులు


విశాఖ‌: ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైయ‌స్ జ‌గ‌న్ మోహన్‌ రెడ్డికి సంఘీభావం తెలడపడానికి ఆయన స్కూల్‌ మిత్రులు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వచ్చారు. ప్రజాసంకల్పయాత్ర 257వ రోజులో భాగంగా వైయ‌స్‌ జగన్‌ శనివారం కొత్తపాలెం దగ్గర విశాఖపట్నంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా 1991 బ్యాచ్‌ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన 30 మంది పూర్వ విద్యార్థులు వైయ‌స్‌ జగన్‌కు స్వాగతం పలకడానికి వచ్చారు. స్కూల్‌లో విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షనాలున్న వైయ‌స్‌ జగన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చూడాలని వారందరూ ఆకాంక్షించారు. ఉక్కు నగరంలో ప్రవేశించిన వైయ‌స్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు విశాఖవాసులు భారీగా తరలివచ్చారు.

మొదటి తరగతి నుంచే  నాయకత్వ లక్షణాలు:
1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు వైయ‌స్‌ జగన్‌ క్లాస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించారని, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌ చరిత్రలోనే అదో సంచలన రికార్డు అని వైయ‌స్‌ జగన్‌ క్లాస్‌మెట్స్‌ పేర్కొన్నారు. మొదటి తరగతి నుంచే వైయ‌స్‌ జగన్‌కు నాయకత్వ లక్షణాన్నాయని, ఆయన బిల్ట్‌ ఇన్‌ లీడర్‌ అని అభివర్ణించారు. వైయ‌స్‌ జగన్‌ని చూస్తుంటే తామందరికి చాలా గర్వంగా ఉందన్నారు. తాను గ్రీన్‌ హౌస్‌ కెప్టెన్‌గా, వైయ‌స్‌ జగన్‌ రెడ్‌ హౌస్‌ కెప్టెన్‌‌, రామారావు బ్లూ హౌస్‌ కెప్టెన్‌గా వ్యవహరించామని 27 ఏళ్ల కిందటి విషయాలను వైయ‌స్‌ జగన్‌ స్నేహితుడు ఒకరు గుర్తు చేసుకున్నారు. తాము ముగ్గురం హౌస్‌ కెప్టెన్‌లుగా వ్యవహరించామన్నారు. వైయ‌స్‌ జగన్‌ నాగార్జునా హౌస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి ఆల్‌రౌండర్‌ షీల్డ్‌ తీసుకున్నారన్నారని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వైయ‌స్‌ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు.





తాజా వీడియోలు

Back to Top