ఎంపీ చొరవతో పాఠశాల పరిసరాలు పరిశుభ్రం

సింహాద్రిపురం : మండలంలోని రావులకొలను జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంను ఎంపీ వైయస్‌ అవినాశ్‌రెడ్డి చొరవతో పరిసరాలు బాగు అయ్యాయి. పాఠశాల ఆవరణంలో కంపచెట్లను తొలగించడంతోపాటు రాళ్లను, చెత్తా చెదారాన్ని తొలగించారు. అలాగే మొక్కలు నాటేందుకు గుంతలను తీశారు. రెండు రోజులపాటు పాఠశాల క్రీడా మైదానంలో ఎంపీ వైయస్‌ అవినాశ్‌రెడ్డి సాయంతో పనులు చేస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రాజాబాబు, పాఠశాల కమిటీ చైర్మన్‌ నాగేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే కడపనాగాయపల్లెలో మట్టి రోడ్డు నిర్మాణానికి ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చొరవతో జేసీబీని ఏర్పాటు చేశారని గ్రామ నాయకులు తెలిపారు.తాజా ఫోటోలు

Back to Top