వైయస్‌ జగన్‌కు భయపడి సారీ చెప్పించారు

విజయవాడ: ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో టీడీపీ అరాచకాన్ని ఎక్కడ ఎండగడతారోననే భయంతోనే చంద్రబాబు తన ఎంపీ, ఎమ్మెల్యేలతో ఐఏఎస్‌ అధికారికి సారీ చెప్పించారని ఎమ్మెల్యే పుష్ఫశ్రీవాణి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆమె మాట్లాడుతూ విజయవాడ నగర నడిబొడ్డులో టీడీపీ నేతలు అధికారి బాలసుబ్రమణ్యంపై దాడికి తెగబడటాన్ని ఖండిస్తున్నామన్నారు. విజయవాడ నగరాన్ని చంద్రబాబు రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే స్వయాన ముఖ్యమంత్రి మీడియేటర్‌గా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షి సంఘటనను నీరుగార్చారని దుయ్యబట్టారు. అంటే మహిళలకు ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తోందో అర్థం చేసుకోవాలన్నారు. చెంప చెల్లుమనిపించి సారీ సార్‌ అంటే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. ఆ అధికారి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో. వారి ఫ్యామిలీ ఎంత బాధపడివుంటుందో ప్రభుత్వం ఆలోచించదా అని ధ్వజమెత్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.

Back to Top