పచ్చచొక్కాలకే ఎస్సీ సంక్షేమ నిధులు

చిత్తూరు:   ఎస్సీల పురోభివృద్ధికి నిధులు, ఎస్సీలకు రావాల్సిన నిధులను జన్మభూమి కమిటీలతో పచ్చచొక్కాలకే కట్టబెట్టడం మించిన అన్యాయం మరోకటి లేదని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన ఎస్సీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దుష్టపాలన సాగిస్తున్నారు, పూర్తిగా ఎస్సీ,ఎస్టీల ప్రయోజనాలకు నష్టం కలిగేలా సాగుతోంది. . జన్మభూమి కమీటలతో ఎస్సీలకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీలకు రావాల్సిన రుణాలు, ఇళ్లు, ఫించన్లు వంటి వాటిని పక్కదోవ పట్టించడం దారుణమని మండిపడ్డారు.  ప్రజలు తిరస్కరించిన వ్యక్తులకు అధికారాలు కట్టబెడుతూ, రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కేవలం ఆదాయం కోసమే కరెంటు బిల్లుల పేరుతో చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీలపై భారం మోపుతున్నారని అన్నారు. ఇంతటి దుర్మార్గ పాలన మనకు అవసరం లేదని ప్రతి ఒక్కరూ గొంతు విప్పి చెప్పాలన్నారు.
మహానేత వైయస్‌ ఆర్‌ హయాంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలు చాలా హాయిగా ఉన్నారు. ప్రతి దళిత కుటుంబానికి చేయూత, భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే జననేత జగన్‌  పనిచేస్తునారనీ ఆయనకు మద్ధతుగా దళితులంతా ఏకతాటిపైకి రావాలన్నారు. మహానేత దివంగత  వైయస్‌ ఆర్‌ ముఖ్యమంత్రిగా చేపట్టిన  కార్యక్రమాలన్నీ దళితుల సంక్షేమానికి మెట్లు వేశాయన్నారు. ఆయన తనయుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వస్తే సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పేలా కార్యక్రమాలను ముందుకు తీసుకెళతారని శ్రీనివాసులు వివరించారు. 45 ఏళ్లకే ఫించను 1.50 లక్షల మంది ఎస్సీలంతా జగన్‌ కు బాసటగా ఉన్నారని పేర్కొన్నారు.


Back to Top