ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సమావేశం

చిత్తూరు(తిరుపతి రూరల్): వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్య‌వ‌ర్గ స‌మావేశం శ‌నివారం తిరుప‌తిలో నిర్వ‌హిస్తున్నట్లు ఎస్సీ సెల్ జిల్లా అధ్య‌క్షుడు దామినేటి కేశ‌వులు తెలిపారు. తిరుప‌తిలోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో శ‌నివారం మ‌ధ్యాహ్నం 2: 30 గంట‌ల‌కు నిర్వ‌హించే ఈ స‌మావేశానికి పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు భూమాన క‌రుణాక‌ర్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద్‌, పార్టీ జిల్లా అధ్య‌క్షుడు గంగాధ‌ర నెల్లూరు ఎమ్మెల్యే నారాయ‌ణ‌స్వామిలు ముఖ్య అతిథులుగా పాల్గొంటార‌ని తెలిపారు.

 జిల్లా ఎస్సీ సెల్ కార్య‌వ‌ర్గ స‌భ్యులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, కార్య‌ద‌ర్శులు ప‌ట్ట‌ణ ఎస్సీ సెల్ అధ్య‌క్షులు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య‌వ‌ర్గ ప్ర‌తినిధులంద‌రు ఈ స‌మావేశంలో పాల్గొనాల‌ని కోరారు. ఈ స‌మావేశంలో ఎస్సీ సెల్ జిల్లా కార్య‌ద‌ర్శులు హ‌రిబాబు, పేరూరు బాబులు పాల్గొన్నారు. 
Back to Top