విషజ్వరాల నుండి కాపాడండి

న్యూఢిల్లీ: విష జ్వరాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లాను ఆదుకోవాలని వైయస్సార్సీపీ పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖా సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థతులను వివరించారు. ప్రకాశం జిల్లాలో విషజ్వరాలు ప్రభలతున్నాయని, వాటికారణంగా మందిలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని మంత్రికి తెలిపారు.

జ్వరాల నివారణకు కేం‍ద్రం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. అంతేకాకుండా ఒంగోలు రిమ్స్‌ ఆస్పత్రిలో ప్లేట్‌లెట్స్‌ కౌంటింగ్‌ మిషన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ విషయంలో కేం‍ద్రం జోక్యం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కోరారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో వంద మందికిపైగా మృతిచెందితే చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైవీ మండిపడ్డారు

తాజా ఫోటోలు

Back to Top