సేవ్ డెమొక్ర‌సీ

విజ‌య‌వాడ‌) ప్ర‌జాస్వామ్యాన్ని ప‌రిర‌క్షించేందుకు వైఎస్సార్సీపీ పిలుపు మేర‌కు రాష్ట్రవ్యాప్తంగా సేవ్ డెమొక్ర‌సీ ర్యాలీలు నిర్వ‌హించారు. జిల్లా ముఖ్య కేంద్రాలు, ప‌ట్ట‌ణాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు జ‌రిగాయి. వివిధ ప్ర‌ధాన కేంద్రాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ర్యాలీల్లో పాల్గొన్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా స్కాములు, అవినీతి ఒప్పందాల్లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న అనుచ‌రులు వేల కోట్ల రూపాయిలు సంపాదించిన సంగ‌తి తెలిసిందే. అవినీతి సంపాద‌న‌తో వ‌చ్చిన సొమ్ముల్ని ఎర వేస్తూ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల‌ను ఆయ‌న కొనుగోలు చేస్తున్నారు. ప్ర‌జాస్వామ్యానికి మాయ‌ని మ‌చ్చ‌లా చంద్ర‌బాబు సాగిస్తున్న అక్రమాల మీద నిర‌స‌న తెలిపేందుకు వైఎస్సార్సీపీ ఈ ర్యాలీలు నిర్వ‌హించింది. 
Back to Top