సేవ్‌ డెమోక్రసీ

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబుపై ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాలన్నీ మండిపడుతున్నాయి. సేవ్‌ డెమోక్రసీ పేరుతో ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమం ఏపీలో విజయవంతంగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు రాజ్యాంగ వ్యతిరేక పాలన సాగిస్తున్న చంద్రబాబుకు  వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రాల వద్ద ఫ్లకార్డులు పట్టుకొని శాంతియుత నిరసన తెలుపుతున్నారు. రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య విలువలను పాటించని ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఫిరాయింపు దారులకు మంత్రి పదవులు కేటాయించడం కాదు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Back to Top