చంద్రబాబు కుట్రలకు నిరసనగా సేవ్ డెమొక్రసీ

♦ నేటి నుంచి వైఎస్సార్సీపీ ఆందోళన కార్యక్రమాలు
♦ జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు, బహిరంగ సభలు
♦ ప్రజా, రాజకీయ పక్షాల మద్దతు
 
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రణభేరి మోగించింది. ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేస్తూ సంతబేరాలు సాగిస్తున్న సీఎం చంద్రబాబు తీరును తీవ్రంగా గర్హిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘సేవ్ డెమొక్రసీ’ (ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి) పేరుతో ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అధికారం చేపట్టింది మొదలు అడ్డగోలుగా దోచుకున్న అవినీతి సొమ్మును విరజిమ్ముతూ ప్రజా తీర్పుకు వెన్నుపోటు పొడుస్తున్న బాబు చర్యలపై.... ప్రజలను చైతన్యపరచేందుకు  రాష్ర్టం లోని అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

 డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఆశచూపి, తమ పార్టీలో చేరితే ఉన్న కేసులు తప్పిస్తామనీ లేదంటే కొత్త కేసులు బనాయిస్తామనీ .... సామ దాన భేద దండోపాయాలతో విపక్ష ఎమ్మెల్యేలను లొంగదీసుకుంటున్న బాబు దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.  నిస్సిగ్గుగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పుతున్న తీరును ఎండగట్టారు. బాబు నీచ రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలకు వామపక్షాలతో పాటు పలు రాజకీయపార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో దీన్ని తీవ్రస్థాయి ప్రజా ఉద్యమంగా మలిచేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోంది.

 గవర్నర్ వద్దకు జగన్
సీఎం హోదాలో చంద్రబాబు పాల్పడుతున్న అనైతిక రాజకీయ వ్యవహారాలపై పార్టీ నేతలతో కలిసి వైఎస్ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.   రెండేళ్ల పాలనలో అవినీతికి పాల్పడి సంపాదించిన సొమ్ముతో బాబు విపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి కోనుగోలు చేస్తున్నారని,  చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. 

 25న ప్రధాని, రాష్ట్రపతితో భేటీ!
రాష్ట్రంలో జరుగుతున్న అరాచకీయాన్ని జాతీయ స్థాయిలోనూ వివరించేందుకు జననేత సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్యనాయకులు ఢిల్లీకి వెళ్లాలని ఈ నెల 19న పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు ‘సేవ్ డెమొక్రసీ’ ఆందోళన తర్వాత రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాష్ట్రపతిని కలవనున్నారు.  రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న అనైతిక రాజకీయ కార్యకలాపాలను ప్రధానమంత్రి, రాష్ట్రపతిలకు ఫిర్యాదు చేస్తారు.  ఫిరాయింపు నిరోధక చట్టంలోని లోపాలను ఆసరాగా చేసుకుని ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తున్నారన్నదానిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నారు.

To read the same article in English: http://ow.ly/4n31qX 

తాజా వీడియోలు

Back to Top