సేవ్ డెమోక్రసీ

ఉదయగిరి: వైయస్సార్‌సీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు టీడీపీ కండువా కప్పి మంత్రివర్గంలో స్థానం కల్పించడంపై సేవ్‌డెమోక్రసీ పేరుతో శుక్రవారం నియోజకవర్గ కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వైయస్సార్‌సీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలు హాజరుకావాలని ఆయన కోరారు.

Back to Top