సత్తెనపల్లి పట్టణంలో నేడు షర్మిల పాదయాత్ర

వెన్నాదేవి (గుంటూరు జిల్లా), 4 మార్చి 2013: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం సత్తెనపల్లి పట్టణంలో కొనసాగుతుంది. ఆదివారం రాత్రి బసచేసిన వెన్నాదేవి ప్రాంతం నుంచి సోమవారం ఉదయం శ్రీమతి షర్మిల 81వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. సత్తెనపల్లి పట్టణంలోని ముస్లింబజార్, ఐదులాంతర్ల సెంట‌ర్, గడియారం స్తంభం సెంట‌ర్, తాలూకా సెంట‌ర్‌కు శ్రీమతి షర్మిల చేరుకుంటారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్‌ మర్రి రాజశేఖర్‌, పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్‌ తెలిపారు. విద్యుత్ కోతలకు నిరసనగా వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి తాలూకా కార్యాలయం వద్ద జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో శ్రీమతి షర్మిల పాల్గొంటారని వారు వివరించారు. ధర్నాలో పాల్గొన్న తరువాత అక్కడి నుంచి విజయా బ్యాంకు రోడ్, కూరగాయల మార్కె‌ట్, వెంకటపతినగ‌ర్ మీదుగా‌ శ్రీమతి షర్మిల సోమవారం రాత్రి బసకు చేరుకుంటారని వారు చెప్పారు.
Back to Top