'సత్తెనపల్లి'లో నేడు షర్మిల పాదయాత్ర

గుంటూరు, 3 మార్చి 2013: మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి తనయ, జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖ‌ర్, పార్టీ ‌కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురామ్ తెలిపారు. ‌తొలిరోజున బసచేసిన ప్రాంతం నుంచి శ్రీమతి షర్మిల ఆదివారం ఉదయం బయలుదేరి సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాడు కాలనీ, వెన్నాదీవి మీదుగా భోజన విరామ కేంద్రానికి చేరుకుంటారు.

భోజన విరామం అనంతరం శ్రీమతి షర్మిల అక్కడి నుంచి బయలుదేరి సత్తెనపల్లిలోని ముస్లింబజార్, శివాలయం సెంట‌ర్, ఐదు‌ లాంతర్ల సెంటర్, గడియారం స్తంభం సెంట‌ర్, తాలూకా సెంట‌ర్‌కు చేరుకుంటారు. తాలూకా సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీమతి షర్మిల అభిమానులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి విజయా బ్యాంకు రోడ్, కూరగాయల మార్కె‌ట్, నరసరావుపేట రో‌డ్ మీదుగా‌ రాత్రికి బస చేసే కేంద్రానికి చేరుకుంటారు.
Back to Top