లక్షన్నర కొలువుల కోసం సంతకాల సేకరణహైద‌రాబాద్‌:  ఎన్నిక‌లకు ముందు టీఆర్ఎస్ అధినేత కే.చంద్ర‌శేఖ‌ర్‌రావు ఇచ్చిన ల‌క్ష‌న్న‌ర ఉద్యోగాల భ‌ర్తీపై మాట నిల‌బెట్టుకోవాల‌ని డిమాండు చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ తెలంగాణ విభాగం ఆధ్వ‌ర్యంలో సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర‌వ్యాప్తంగా ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణమే ఖాళీగా ఉన్న లక్షన్నర ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకరావటానికి తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 8 నుంచి 16 వరకు మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో, పట్టణాలలో "లక్షన్నర కొలువుల కోసం సంతకాల సేకరణ" కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఆయా జిల్లాలలో జిల్లా అధ్యక్షులు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
Back to Top