శనివారంనాటి షర్మిల పాదయాత్ర ఇలా

విజయవాడ, 13 ఏప్రిల్ 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 119వ రోజుకు చేరింది.  శనివారం ఉదయం యనమదలలో యాత్ర ప్రారంభమవుతుందని, అక్కడే రచ్చబండ నిర్వహిస్తారని పార్టీ కార్యక్రమాల కమిటీ రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను తెలిపారు. ఈదర జంక్షన్ వరకు పాదయాత్ర సాగిన తరువాత విరామం ఉంటుందని చెప్పారు. సాయంత్రం భట్టులవారిగూడెం వరకు పాదయాత్ర సాగిన తరువాత షర్మిల రాత్రి బస చేస్తారని వారు వివరించారు.

Back to Top