సంతోషంగా ఉంది

కాకినాడ, 02 ఫిబ్రవరి 2013:

తాను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అనుచర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ఆయన వెల్లడించారు. డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీనుంచి తనను సస్సెండ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. తొమ్మిదిమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బొత్స సత్యనారాయణ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో ద్వారంపూడి పైవిధంగా వ్యాఖ్యానించారు.

Back to Top