'సంతకం'తో జగన్‌కు న్యాయవాదుల సంఘీభావం

హైదరాబాద్: వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అక్రమంగా జైలులో నిర్బంధించిన శ్రీ జగన్మోహన్‌రెడ్డి విడుదల కోరుతూ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 'జగన్‌ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో ఆదివారం నాటికి 1,24,36,000 మంది తమ సంతకాలు చేసి మద్దతు తెలిపారు. నిజానికి పార్టీ కోటి సంతకాల సేకరణ అంటూ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ వస్తోంది. అదే క్రమంలో హైదరాబాద్‌, సికిందరాబాద్‌ జంట నగరాల పరిధిలోని న్యాయస్థానాల వద్ద సోమవారంనాడు న్యాయవాదులు కూడా అధికసంఖ్యలో సంతకాలు చేసి తమ మద్దతును తెలిపారు. రాజకీయ కక్షతోనే శ్రీ జగన్‌ను అక్రమంగా జైలులో పెట్టారని న్యాయవాదులు ఈ సందర్భంగా మండిపడ్డారు. పార్టీ హైదరాబాద్ ‌న్యాయ విభాగం కన్వీనర్ ఎం.బా‌ల్‌రాజ్‌గౌడ్ నేతృత్వంలో ‌శ్రీ జగన్‌కు మద్దతుగా సంతకాలు సేకరించారు. వందలాది మంది న్యాయవాదులు సంతకాలు చేశారు.

తాజా ఫోటోలు

Back to Top