'సంతకం'తో జగన్‌కు భారీగా జనం మద్దతు

చోడవరం (విశాఖ జిల్లా) : జననేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి పట్ల తమకు ఉన్న అచంచలమైన అభిమానాన్ని తమ సంతకం ద్వారా రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున వెల్లడిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. జనం కోరుకుంటున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రజల మధ్య తిరగనీయకుండా కాంగ్రెస్‌, టిడిపిలు కుట్ర పన్నాయని రామకృష్ణ ఆరోపించారు. వైయస్‌ఆర్‌సిపి యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆధ్వర్యంలో నూతన ప్రచార రథాన్ని చోడవరం కార్యాలయం నుంచి బుధవారం కొణతాల ప్రారంభించారు.‌

ప్రజాసమస్యలపై పోరాటం చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే శ్రీ జగన్మోహన్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారన్నాని అంతకు ముందు విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. సిబిఐని కాంగ్రెస్‌ పార్టీ తన చెప్పుచేతల్లో ఉంచుకొని ఎదురు తిరిగిన నాయలకుపై కక్షకట్టి కేసులు బనాయిస్తోందని దుయ్యబట్టారు. కొన్ని కేసుల్లో కేంద్రం సిబిఐ విషయంలో కలుగజేసుకుంటోందని, ఇదే విషయాన్ని ఆ సంస్థ మాజీ డైరక్టర్లు సైతం చెప్పడం వల్ల అర్థమవుతోందన్నారు. సిబిఐ చర్యలకు నిరసనగా కోటి సంతకాల ఉద్యమాన్ని చేపడుతున్నామన్నారు. జనం మద్దతు తెలిపేందుకు చేపట్టిన ఉద్యమానికి మంచి స్పందన వస్తోందన్నారు. ఇది శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు ఏ మేరకు కోరుకుంటున్నదీ తెలియజెబుతోందన్నారు.

తొలుత అన్ని కేసుల విచారణలో భాగంగా అరెస్టు చేశామని చెప్పిన సిబిఐ ఇప్పుడు కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్టు చేశామని చెప్పడం కక్షసాధింపు చర్యేనని కొణతాల ఆరోపించారు. ఏ కేసైనా విచారణలో ఉన్నప్పుడు 90‌ రోజు‌లు దాటితే బెయిల్ ఇవ్వాలని, అలాంటిది 220 రోజులు అయి‌పోయినా బెయిల్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ‌ఆయన ప్రశ్నించారు.
Back to Top