శంకరగుప్తంలో వినూత్న నిరసన

అమలాపురం:

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి సహా పలువురు నేతలు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సఖినేటిపల్లి మండలం శంకరగుప్తంలో కూడా ఈ ఉద్యమం ముమ్మరంగా  సాగింది. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో పలువురు అభిమానులు మోకాళ్లపై నిలిచి జగన్ అక్రమ నిర్భంధంపై వినూత్నంగా ఆందోళన చేశారు. రామచంద్రపురం, దాక్షారామ వంటి ప్రాంతాల్లో కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. పార్టీ కేంద్ర పాలక మండలి  సభ్యులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఈ కార్యక్రమాన్నిపర్యవేక్షించారు. చేతులు లేని ఓ ఇంటర్ విద్యార్థి కాళ్లతో జగన్ కోసం సంతకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు. మండపేటలో జిల్లా వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, జిల్లా రైతు విభాగం కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ వేర్వేరు ప్రాంతాల్లో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఫోను చేసి కార్యక్రమం సాగుతున్న తీరుపై కర్రి పాపారాయుడు నుంచి వివరాలు తెలుసుకున్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్‌లో పార్టీ నేత చలమలశెట్టి సునీల్, జెడ్పీ నేత చెల్లుబోయిన వేణు, జిల్లా ప్రచార, బీసీ సెల్ కన్వీనర్లు రావూరి వెంకటేశ్వరరావు, గుత్తుల రమణ ఆధ్వర్యంలో సంతకాలను సేకరించారు.

Back to Top