నిరుపేదల ఉసురు పోసుకొంటున్న ప్రభుత్వం


విజయవాడ) చంద్రబాబు ప్రభుత్వం నిరుపేదల మీద ప్రతాపం చూపించి, వారి ఉసురు పోసుకొంటోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత సామినేని ఉదయభాను ఆరోపించారు. క్రష్ణా జిల్లా జగ్గయ్య పేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగ్గయ్య పేటలోని ఎర్ర కాల్వ గట్టు మీద అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నిరుపేదలు ..ఉదయ భాను ని ఆయన నివాసంలో కలిశాు. 257 మంది పేదల్ని నివాసాలు ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం ఇచ్చిన నోటీసుని చూపించారు. ప్రభుత్వ చర్యల మీద ఆయన స్పందించారు. నిరుపేదల మీద ప్రతాపం చూపించాలనుకోవటం సరైన చర్య కాదని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ నోటీసులు ఉపసంహరించుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.


Back to Top