సమస్యలు తెలుసు.. జగనన్నను బలపరచండి

రాజానగరం, 08 జూన్ 2013:

రచ్చబండలో ప్రజల సమస్యలు తెలుసుకోవాలని వచ్చాననీ,  కానీ వాన కారణంగా మీ బదులు నేనే మాట్లాడతాననీ అందుకు సమ్మతమేనా అంటూ శ్రీమతి వైయస్ షర్మిల ప్రశ్నించారు.  రాజానగరం మండలం తోకాడలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆమె ఉపక్రమిస్తుండగా పెద్ద వాన మొదలైంది. ఆ వానలోనే ఆమె రచ్చబండను కొనసాగించారు. ప్రజల అనుమతితో ఆమె మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, జిల్లాలో ఆమె సాగిస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం రాజానగరం నుంచి అదే మండలంలోని మల్లంపూడి వరకూ సాగింది. తోకాడ నడిబొడ్డులో సాయంత్రం 6.15 గంటలకు రచ్చబండ ఏర్పాటు చేశారు. తమ సమస్యలపై రచ్చబండలో చర్చించేందుకు వచ్చిన జనం వర్షం కురవడంతో నిరాశ పడ్డారు. కానీ శ్రీమతి షర్మిల వానలో తడుస్తూనే వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆమె గ్రామం చేరుకునే సరికి సీజీసీ సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వాగతం పలికారు.

తమకు రేషన్ కార్డు లు సక్రమంగా ఇవ్వడం లేదని, రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా మహిళలకు పావ లా వడ్డీ రుణాలు రెన్యువల్ కావడం లేదనీ, విద్యార్థులకు ఫీజు రీ యింబర్సుమెంటు అందడం లేదనీ, గ్రామంలో సుమారు 1500 ఎకరాల్లో పంట నీలం తుపాను కారణంగా నష్టపోగా నేటికీ పరిహారం అందలేదనీ, ఇంకా ఇతర సమస్యలను రచ్చబండలో షర్మిల దృష్టికి తేవాలని స్థానికులు ఎదురు చూశారు. శ్రీమతి షర్మిల ‘సమస్యలు తాను తెలుసుకున్నాననీ,  మీ కష్టాలు తీరాలంటే జగనన్నను, వైయస్ఆర్ కాంగ్రెస్‌ని బలపరచాలి’ అని కోరారు. సుమారు 10 నిముషాల పాటు షర్మిల ప్రజల సమస్యలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు.

రచ్చబండ వేదికపై షర్మిలతో పాటు ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, సీజీసీ స భ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జ్యో తుల నెహ్రూ, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, రాష్ట్ర మహిళా విభా గం కన్వీనర్ కొల్లి నిర్మల కుమారి, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు బొడ్డు అనంత వెంకట రమణ చౌదరి, అధికార ప్రతినిధి పి.కె.రావు, రా జమండ్రి రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, వాణిజ్య, ప్రచార, బీసీ, ఇండస్ట్రియల్ విభాగాల జిల్లా కన్వీనర్లు కర్రి పాపారాయుడు, రావూరి వెంకటేశ్వరరావు, గుత్తుల రమణ, మంతెన రవిరాజు, యువ నాయకులు జక్కంపూడి రాజా, ఆర్.వి.వి.వి.సత్యనారాయణ, రాజమండ్రి నగర యువజన విభాగం కన్వీనర్ గుర్రం గౌతం, వాసిరెడ్డి జమీల్, కుశనం దొరబాబు, చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Back to Top