సమస్యల పరిష్కారమే లక్ష్యంగా షర్మిల పాదయాత్ర

వేములపల్లి (నల్గొండ జిల్లా) : రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీమతి షర్మిల చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యురాలు పాదూరి కరుణ పేర్కొన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీమతి షర్మిల పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. జననేత జగనన్న నేతృత్వంలో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీతోనే రైతులు అభివృద్ధి చెందుతారని ‌ఆమె అన్నారు. వేములపల్లి మండలంలోని పాములపాడులో శుక్రవారంనాడు పార్టీ నల్గొండ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు పాదూరి కరుణ సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కరుణ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దివంగత మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంటకు గిట్టుబాటు ధర లభించేదని కరుణ గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తున్నదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.‌
Back to Top