వైయ‌స్ జ‌గ‌న్‌కు సాక్ష‌ర భార‌త్ ఉద్యోగుల విన‌తి

వైయ‌స్ జ‌గ‌న్‌కు సాక్ష‌ర భార‌త్ ఉద్యోగుల విన‌తి
క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని సాక్ష‌ర భార‌త్ ఉద్యోగులు క‌లిశారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా క‌ర్నూలు జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న ప్ర‌తిప‌క్ష నేత‌ను క‌లిసిన సాక్ష‌ర భార‌త్ సిబ్బంది త‌మ‌కు సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం జీతాలు ఇవ్వ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. గ్రామ కో-ఆర్డినేట‌ర్ల‌కు రూ.6 వేల క‌నీస వేత‌నం ఇవ్వాల్సి ఉండ‌గా రూ.2  వేలు మాత్ర‌మే ఇస్తున్నార‌ని, అది కూడా ఎప్పుడు ఆరు నెల‌ల‌కు ఇస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమ వేతనాన్ని సవరించాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అలాగే ఈఎస్ఐ. పీఎఫ్ వ‌ర్తింప‌జేయాల‌ని కోరారు. వీరికి న్యాయం చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు.  

గోడు వెల్ల‌బోసుకున్న 104 సిబ్బంది
ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో 104 సిబ్బంది వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి త‌మ గోడు వెల్ల‌బోసుకున్నారు. దొర్నిపాడు వ‌ద్ద జ‌న‌నేత‌కు క‌లిసిన 104 సిబ్బంది త‌మ‌కు స‌కాలంలో వేత‌నాలు ఇవ్వ‌డం లేద‌ని, మందులు పంపిణీ చేయ‌డం లేద‌ని, వాహ‌నం నిర్వాహ‌ణ‌కు ఖ‌ర్చులు చెల్లించ‌డం లేద‌ని ఏక‌రువు పెట్టారు. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మంచి ఉద్దేశంతో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నీరుగారుస్తుంద‌ని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన వైయ‌స్ జ‌గ‌న్ మ‌న ప్ర‌భుత్వం రాగానే 104, 108 ప‌థ‌కాల‌ను మెరుగుప‌రుస్తాన‌ని హామీ ఇచ్చారు.
Back to Top