చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఉచితంగా ఇసుక ఇస్తున్నామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఫైరయ్యారు. గ్రామాల్లో ఎక్కడ కూడా సామాన్య ప్రజలకు ఉచిత ఇసుక అందడం లేదన్నారు.టీడీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే ఉచితంగా ఇసుక ఇస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. రాజధాని, ఇసుక పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేలు లక్షల కోట్ల రూపాయిలు దండుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, నారా లోకేష్ల అక్రమార్జన కోసమే పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. To read this article in English: http://goo.gl/vIBgwv