రాజకీయమంటే చంద్రబాబు ఒక ఆట


ప్రకాశం: రాజకీయమంటే చంద్రబాబు ఒక ఆటగా మారిందని వైయస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఏపీలోని  25 స్థానాలు గెలుచుకుంటే ప్రత్యేక హోదా సాధించుకోవచ్చు అన్నారు. బీజేపీతో సంబంధాలు ఉంటే కేంద్రంపై 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెడతామా అని ప్రశ్నించారు. అవిశ్వాస తీర్మానం పెట్టడమంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లే అన్నారు. ఏ రాజకీయ పార్టీకైనా క్షేత్రస్థాయిలోని బూత్‌ కమిటీలే వెన్నెముక అని అన్నారు. ప్రత్యర్థి పార్టీని మట్టికరిపించేలా బూత్‌ కన్వీనర్లు కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని బూత్‌ కన్వీనర్లకు సజ్జల సూచించారు.
 
Back to Top