వెన్ను చూపని యోధుడు వైయస్‌ జగన్‌హైదరాబాద్‌: అధికార పార్టీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెన్నుచూపని యోధుడని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ జగన్‌ జన్మదిన వేడుకలలో ఆయన మాట్లాడుతూ..గత ఎనిమిదేళ్లుగా రాష్ట్రంలో వైయస్‌ జగన్‌ ఒక అరుదైన నాయకుడిగా మన కళ్ల ముందు ఆవిష్కరించబడ్డాడని తెలిపారు. రాజన్న బిడ్డపై అన్ని రకాలుగా కుట్రలు పన్ని, ఆయన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వెన్నుచూపి వెనకకు తిరుగలేదన్నారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆచరణలో చూపిన కార్యక్రమాలే పునాదిగా పుట్టింది వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నారు.  వైయస్‌ జగన్‌ ప్రజలకు అండగా ఉండేందుకు నిత్యం ప్రజలతోనే మమేకమవుతున్నారని చెప్పారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామీగా తీసుకెళ్లే నాయకుడు వైయస్‌ జగన్‌ అన్నారు. ఆయన నుంచి ప్రజలతో మమేకమయ్యే గుణాన్ని, అంకితభావాన్ని ప్రతి  కార్యకర్త స్వీకరించాలన్నారు.


 
Back to Top