సాయిరెడ్డి ఎప్పటికీ వైయస్‌ కుటుంబ మనిషే


వ్యవస్థలను మ్యానేజ్‌ చేసి జైలుకు పంపుతారా పప్పుగారూ..
మీకు హైదరాబాద్‌లో ఏం పని పప్పుగారూ..
లోపాయికారి ఒప్పందాల అలవాటు నిప్పు.. పప్పుకే ఉన్నాయ్‌
అన్యాయం, అవినీతి, అక్రమం పప్పునాయుడు పోర్టుఫోలియోలు
పవన్‌ ఆరోపణలకు సమాధానం చెప్పండి పప్పుగారూ..
లోకేష్‌ ప్రశ్నలకు ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటైన కౌంటర్‌

చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనను విమర్శించే హక్కు పప్పునాయుడు (లోకేష్‌)కు లేదన్నారు. తాను ఎప్పటికీ వైయస్‌ కుటుంబ సభ్యుడేనంటూ విరుచుకుపడ్డారు. లోకేష్‌ ప్రశ్నలకు విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్‌ ఆయన మాటల్లోనే...

1. విజయసాయిరెడ్డి బీజేపీ ఎంపీనా అని పప్పునాయుడు ప్రశ్న? 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీఫాం ఇస్తే వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికన వ్యక్తి విజయసాయిరెడ్డి. చిత్తశుద్ధి లేని పార్టీ 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను ఏ విధంగా డబ్బులు పెట్టి కొన్నారో.. ఆ రకంగా అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. ఎప్పటికీ విజయసాయిరెడ్డి వైయస్‌ కుటుంబంలో మనిషి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు పప్పునాయుడు. 

2. రేపేమాపో జైలు శిక్ష పడే వ్యక్తికి ప్రధాని కార్యాలయంలో తరచు ఎలా ప్రవేశం లభిస్తుంది?
రేపోమాపో జైలుకు పోయేది తన సొంత తండ్రికి కూడా పప్పునాయుడు అప్లయ్‌ చేసుకోవాలి. గతంలో తన సహజ ధోరణిలో నిప్పు, పప్పులకు వ్యవస్థలను మేనేజీ చేస్తే అలవాటు ఉందో.. అలా వ్యవస్థలను మేనేజ్‌ చేసి పంపించదలచుకున్నారా..? ఇక జైలుకు ఎవరు వెళ్తారో.. తరువాత తెలుస్తుంది. 

3. ఉదయం విజయవాడకు వచ్చి సాయంత్రం హైదరాబాద్‌కు వెళ్లే విజయసాయిరెడ్డి నన్ను విమర్శిస్తారా?  
పప్పునాయుడు గారూ.. మీరు సోమవారం మధ్యాహ్నం విజయవాడకు వెళ్తారు. మళ్లీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు వస్తారు. మీకు హైదరాబాద్‌లో ఏం పని. రాజధాని అమరావతిలో ఉంది.. మీరు మంత్రిగా ఉన్నారు. మీకు హైదరాబాద్‌లో ఏం పని. ఢిల్లీలో లేదా.. పార్టీకి సంబంధించిన విషయాలపై 13 జిల్లాల్లో తిరుగుతుంటాను కానీ.. హైదరాబాద్‌లో ఉండను. ఈ విషయాన్ని పప్పుగారూ గ్రహించాలి. 

4. బీజేపీతో లోపాయకార ఒప్పందం ఉందా..?

లోపాయికారి ఒప్పందం చేసుకునే అలవాటు నిప్పు.. పప్పుకు ఉంది కానీ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి లేదు. అటువంటి వాటికి పాల్పడం.
 
5. ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎవరు పోరాడుతారని పప్పునాయుడు ప్రశ్నిస్తున్నారు. 
నిజంగా మీకు చిత్తశుద్ధి నాలుగేళ్లుగా నిద్రపోతున్నారా.. మీకు సిగ్గు, ఎగ్గు ఉంటే.. మీ దేహంలో చీమూ నెత్తురు పారుతుంటే.. నాలుగేళ్లు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం అనుభవించి యూటర్న్‌ తీసుకొని రాష్ట్రాన్ని ఉద్దరించేందుకు పోరాటం చేస్తున్నట్లుగా డ్రామాలు ఆడుతున్నారని ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వైయస్‌ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏ రకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో.. అదే బాటలో నడవాలి. 

పప్పుగారిపై పవన్‌ ఆరోపణలు.. సమాధానం ఎక్కడ..
పప్పునాయుడుకు మూడు పోర్టుపోలియోలు ఉన్నాయి. అన్యాయం, అక్రమం. అవినీతి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌ పప్పునాయుడిపై ఆరోపణలు చేశారు. పప్పునాయుడు అనే వ్యక్తి చరిత్రలో ఎవరూ చేయని విధంగా అవినీతికి పాల్పడ్డారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మానసికంగా క్షోభకు గురిచేసి ఆయన మృతికి కారణమయ్యాడో.. ఆయన ఆత్మ ఈయన అవినీతిని చూసి క్షోభిస్తుందని ఆరోపణలు చేశారు. ముందు పవన్‌ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలి.

పది అంశాలపై సీబీఐ ఎంక్వైరీ వేసుకోవాలి
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామికల్‌ రీసెర్చ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆంధ్రరాష్ట్రం అవినీతిలో నంబర్‌ వన్‌ అని చెప్పింది. చంద్రబాబు చేసిన పది అంశాలపై వైయస్‌ఆర్‌ సీపీ సీబీఐ ఎంక్వైరీ జరపాల్సిందిగా కోరుతున్నాం. పోలవరం, రాజధాని భూకుంభకోణం, తాత్కాలిక సచివాలయం, భూ కేటాయింపులు, విదేశీ పర్యటనలు, లావాదేవీలు, కాల్‌మనీ సెక్స్‌రాకెట్, ఓటుకు కోట్ల కేసు, హెరిటేజ్‌లో షేర్‌ వ్యాల్యూల పెంపు, అగ్రిగోల్డ్‌ అంశాలపై నిజంగా మీకు ధైర్యం ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేసుకొని నిర్దోషిగా రావాలి. 

ఇదేనా మీరు నేర్చుకున్న జర్నలిజం: రాధాకృష్ణ గారూ..
ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ అనువనువులో తెలుగుదేశం పార్టీ రక్తం ప్రవహిస్తుంది. అభిమానం ఉండొచ్చు కానీ మొదట జర్నలిస్టు అని గ్రహించాలి. పత్రిక అనేది రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు. సమతూల్యం పాటించాలని గుర్తించాలి. చంద్రబాబు తుమ్మితే.. అద్భుతంగా తుమ్మారని, ఈ రకమైన జర్నలిసమా మీరు నేర్చుకుంది.. జర్నలిసంపై గౌరవం ఉంటే సమతూల్యం పాటించాలి. 
Back to Top