'సహకారం'లో వ్యూహాత్మకంగా కృషి చేయండి

హైదరాబాద్‌ : సహకార సంఘాల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, సిజిసి సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  వైయస్‌ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారంనాడు తూర్పు గోదావరి జిల్లా ముఖ్య నాయకులతో మైసూరారెడ్డి, మరో సిజిసి సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ సహకార ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఎన్నో కార్యక్రమాలు అమలు చేశారని, పార్టీపై ఉన్న సానుభూతిని అనుకూలంగా మలచుకుని సహకార ఎన్నికల్లో సత్తా చాటాలని సూచించారు.

ఈ సమీక్ష సందర్భంగా నియోజకవర్గాల వారీగా పార్టీకి అనుకూలంగా ఉన్న సొసైటీల వివరాలను వారు అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు‌న మహానేత వైయస్ పథకాలు, మరోవైపు పార్టీకి ఉన్న ఆదరణ దృష్ట్యా సహకార ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సిపికి చక్కని విజయావకాశాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో నాయకులు సమన్వయంతో సహకార ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. మెజార్టీ సొసైటీలను కైవసం చేసుకోవడం ద్వారా డిసిసిబిలో కూడా గెలిచేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కోరారు.

జిల్లాలో సహకార ఎన్నికల పరిస్థితిని జిల్లా నాయకులు వివరించారు. సహకార ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే నియోజకవర్గాల పర్యటన కూడా పూర్తి చేసినట్టు వివరించారు. ముఖ్యంగా జిల్లాలో సహకార ఎన్నికల పర్యవేక్షణకు కమిటీని కూడా ఏర్పాటు చేసి, నిత్యం పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు.

ఈ సమీక్షలో పార్టీ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి, జిల్లా పరిశీలకుడు ఇందుకూరి రామకృష్ణంరాజు, సిజిసి సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, జ్యోతుల నెహ్రూ, గంపల వెంకటరమణ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, వరుపుల సుబ్బారావు, కేంద్ర క్రమశిక్షణ సంఘ సభ్యుడు ఎజెవి బుచ్చి మహేశ్వరరావు, డిసిఎంఎస్ చైర్మ‌న్ రెడ్డి వీరవెంకట సత్యప్రసా‌ద్, జెడ్పీ మాజీ చైర్మ‌న్ చెల్లుబోయిన వేణు‌, పార్టీ జిల్లా అనుబంధ సంఘాల కన్వీనర్లు, అధికార ప్రతినిధులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Back to Top