సహకారంలో కాంగ్రెస్ అక్రమాలు: మేకపాటి

నెల్లూరు, 1 ఫిబ్రవరి 2013:

తొలి విడత జరిగిన సహకార ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పలు అక్రమాలకు పాల్పడి విజయం సాధించిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆరోపించారు. సహకార ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆయన విమర్శించారు. అధిష్టానం దృష్టిలో పడేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే రైతుల బలం ఉందని చెప్పుకునేందుకే ప్రభుత్వం ఈ సహకార ఎన్నికలు నిర్వహించినట్టు కనిపించిందని మేకపాటి ఎద్దేవా చేశారు.

షర్మిల పాదయాత్ర కోసం జనం ఎదురు చూపు

     దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పాదయాత్రను స్వాగతించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న శ్రీమతి షర్మిల ఫిబ్రవరి 6వ తేదీ నుండి పాదయాత్ర చేపట్టనున్నారని అన్నారు.

Back to Top