ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయండి...

న్యూఢిల్లీ :
పార్టీ ఫిరాయించిన  వైయస్ ఆర్ కాంగ్రెస్
పార్టీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపిలపై తక్షణమే అనర్హత వేటు
వేయాలని పార్టీ పార్లమెంటరీ నేత వి. విజయసాయిరెడ్డి  లోకసభ స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం
నాడు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలుసుకుని ఈ మేరకు ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని
అందచేశారు. పార్టీ నుంచి గెలుపొందిన ఎంపిలు ఎస్ పి వై రెడ్డి, కొత్తపల్లి గీత,
బుట్టా రేణుక, పొంగులేటి సుధాకరరెడ్డిలపై అనర్హత వేటు వేయాలని చాలా కాలం కిందటే
ఫిర్యాదు చేసినా అవి ఇంకా పెండింగ్ లోనే ఉన్న విషయాన్ని విజయసారెడ్డి స్పీకర్ దృష్టికి
మరోసారి తీసుకెళ్లారు. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకుంటే, రాజ్యాంగ మూల సూత్రాలకు
విఘాతం కలగడమే కాకుండా, ఇవి మరికొంత మంది పార్టీ ఫిరాయించేందుకు అవకాశాలు
కల్పించేవిగా ఉన్నాయని ఆయన అన్నారు. రాజ్యసభలో పార్టీలు ఫిరాయించిన వారిపై 90
రోజుల్లోనే అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తుకు తెస్తూ, లోకసభలో కూడా పార్టీ
ఫిరాయించిన వారిపై తక్షణం అనర్హత 
వేటువేయాలని విజయసాయిరెడ్డి కోరారు. 

తాజా ఫోటోలు

Back to Top