రైతుల‌పై చిన్న చూపు

గుంటూరు : చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం చిన్న చూపు చూస్తోంద‌ని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియ‌ర్ నేత మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ మండి ప‌డ్డారు. గుంటూరు జిల్లా నిజాం ప‌ట్నంలోని త‌న నివాసంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వ‌ర్షాలు లేక నారుమ‌డులు పోయాలా వ‌ద్దా అన్న సందిగ్ద‌త ప‌ట్టి పీడిస్తోందని, వ్య‌వ‌సాయిక ప‌రిస్థితుల‌పై స‌మాచారం ఇవ్వ‌టంలోవ్య‌వ‌సాయ శాఖ విఫ‌లం అయింద‌ని ఆయ‌న అన్నారు. రైతుల‌కు మ‌నో ధైర్యం క‌ల్పించ‌టంలో ప్ర‌భుత్వం విఫ‌లం అయ్యింద‌ని ఆయ‌న అన్నారు. చంద్రబాబుకి ఉద‌యం నుంచి రాత్రి దాకా రాజ‌ధాని జ‌పం త‌ప్ప వేరే అంశాలు ప‌ట్ట‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. పాత బ‌కాయిలు తీర్చ క‌పోవ‌టంతో బ్యాంకులు రైతుల‌కు అప్పులు ఇవ్వ‌టం లేద‌ని మోపిదేవి అన్నారు. అటువంట‌ప్పుడు పెట్టుబ‌డులు దొరికే ప‌రిస్థితి లేక రైతులు విల  విల్లాడుతున్నార‌ని ఆయ‌న అభిప్రాయ ప‌డ్డారు.
Back to Top