రైతుల‌ను ఆదుకోండి

కుందుర్పి: తీవ్ర వర్షాభావంతో సాగుచేసిన వేరుశెనగ విత్తనం సైతం మొలకెత్తగా అప్పుల ఊబీలో ఇరుక్కు పోయిన రైతాంగానికి సత్వరం ప్రభుత్వం వేరుశెనగ పంటనష్ట పరిహారం పంటల భీమా అందించి ఆదుకోవాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 12294మంది రైతులకు గాను ప్రస్తుతం 6800వందల రైతులకు మాత్రమే వేరుశెనగ పంటనష్ట పరిహారం ఖాతాల్లో జమ అయిందని జమైన నగదును సైతం బ్యాంకర్లు పాత బకాయిలకు జమచేసుకొంటూ రైతులకు వెనక్కు పంపుతున్నారని తెలిపారు. మరో పక్క ప్రభుత్వం పంటల భీమా నిధులను విడుదల చేసినట్లు ప్ర‌క‌టిస్తున్న బ్యాంకర్లు మాత్రం తమకు భీమా నిధులు ఇంకా రాలేదని రైతులకు భీమా పరిహారం ఇవ్వడంలో జాప్యం చేస్తున్నట్లు తెలిపారు. మరోపక్క వ్యవసాయ అధికారుల తప్పిదాల కారణంగా మరో 1050మంది రైతులకు పరిహారం అందకుండా పోయిందన్నారు. నేటివరకు మలయనూరు,బసాపురం రెవిన్యూ గ్రామాల్లో 25శాతం మంది రైతులకు çమాత్రమే పరిహారం జయ అయిందని మరో75శాతం మందికి జమకాలేదన్నారు.కార్యక్రమంలో మండల కన్వినర్‌ సత్యనారాయణశాస్త్రి, జిల్లా కార్యకార్యదర్శి ఎస్‌కే ఆంజినేయులు,ఆపార్టీ రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Back to Top