రైతు మహాధర్నా విజయవంతం

అనంతపురంః ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రభుత్వం కళ్లు తెరిపించేలా రైతాంగం సమస్యలపై గర్జించారు. మహాధర్నాకు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేశారు. వేలాది గొంతుకలు ఒక్కటై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాయి.  కరువుతో అల్లాడుతున్న రైతన్నను పట్టించుకోని టీడీపీ సర్కార్ ను అనంతపురం వేదికగా వైయస్ జగన్ ఎండగట్టారు. కలెక్టరేట్ వద్ద మహా ధర్నాలో పాల్గొని రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాతకు తోడుగా నిలిచిన జననేతకు జనం జేజేలు కొట్టారు. రైతుల అభివృద్ధి కోసం పాటుపడింది ఒక్క వైయస్ కుటుంబమేనని రైతులు అన్నారు. రాజన్న తనయుడు వైయస్ జగన్ తోనే రైతాంగం సమస్యలు తీరుతాయని విశ్వసించారు. బాబుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. 
Back to Top