వైయస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కర్నూలు జిల్లాలో రైతు భరోసా యాత్రకు సిద్ధమయ్యారు. జనవరి 5వ  తేదీ (బుధవారం) నుంచి ఐదు రోజుల పాటు జిల్లాలో పర్యటించి అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను వైయస్‌ జగన్‌ పరామర్శిస్తారు. శ్రీశైలం నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుంది. రెండు రోజుల పాటు నియోజకవర్గంలోని మూడు రైతు కుటుంబాలను జననేత పరామర్శించనున్నారు. ఆత్మకూరు పట్టణంలో వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మిగతా మూడు రోజులు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వైయస్‌ జగన్‌ పర్యటించి రైతు కుటుంబాలను ఓదార్చి వారికి భరోసా కల్పించనున్నారు. కరువుతో రైతులు అల్లాడుతున్న పట్టించుకోకుండా పబ్లిసిటీ కోసం పాకులాడుతున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎండగట్టనున్నారు. 
Back to Top