వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభం

అనంతపురంః ప్రతిపక్ష నేత వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ అనంతపురం జిల్లా గుత్తి చేరుకున్నారు. ఈసందర్భంగా జననేతకు పార్టీశ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో  జిల్లాలో వైయస్ జగన్ రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతోంది. తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో వైయస్ జగన్ పర్యటించనున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో వైయస్ జగన్ ఓ భరోసా కల్పించనున్నారు.  పెద్దవడుగూరులో వైయస్ జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. దిమ్మగుడిలో రైతు నాగార్జున కుటుంబానికి అదేవిధంగా చింతలచెరువులో రైతులు వెంకట్ రాంరెడ్డి, జగదీశ్వర్ రెడ్డిల కుటుంబాలను వైయస్ జగన్ పరామర్శిస్తారు.

Back to Top