ప్రతిపక్ష సభ్యులపై అధికార టీడీపీ దౌర్జన్యం

హైదరాబాద్ :  అసెంబ్లీలో మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ప్రత్యేక హోదా నినాదంతో సభ దద్దరిల్లింది.  సమావేశాలు ప్రారంభం కాగానే  ప్రత్యేక హోదాపైనే వెంటనే చర్చ చేపట్టాలని వైయస్ఆర్ సీపీ  పట్టుబట్టింది. హోదాపై చర్చకు అవకాశం కల్పించాలంటూ ప్రతిపక్ష సభ్యులు పోడియం చుట్టు ముట్టి నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అయితే శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై అధికార పక్షం మాటల దాడికి దిగింది

రెచ్చగొట్టే ధోరణిలోనే వ్యవహరిస్తూ సభలో మరింత ఉద్రిక్త పరిస్థితిని సృష్టించింది. మైక్ దొరికితే చాలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ అధికార పార్టీ సభ్యులు ఊగిపోయారు. తిట్టేందుకు టీడీపీ సభ్యులకు మైక్ ఇచ్చిన స్పీకర్‌.... ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌ హోదాపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగానే మైక్ కట్ చేశారు. దీంతో జగన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అటు మార్షల్స్‌ కూడా ప్రతిపక్ష సభ్యులపై అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనడంతో సభ పది నిమిషాలు వాయిదా పడింది. 


Back to Top