మహానేత ఆశయాలకు అనుగుణంగా పాలించండి

ఖమ్మం 08 ఆగస్టు 2013:

దివంగత మహానేత డాక్టర్  వైయస్‌ఆర్ ఆశయాలకు అనుగుణంగా పంచాయతీ పాలన  సాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచులను వైయస్‌ఆర్ కాంగ్రెస్ నాయకులు కోరారు. జిల్లాలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ మద్దతుతో  గెలుపొందిన సర్పంచులకు పార్టీ  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం, అభినందన సభలో పలువురు మాట్లాడారు. రాష్ట్ర నాయకులు గట్టు రామచంద్రరావు, జనక్ ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీజిసి సభ్యుడు చందా లింగయ్య, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు అనేక సూచనలు చేశారు. పార్టీ గుర్తు లేకున్నా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్న అభిమానం, అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు గెలిపించారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పంచాయతీల్లో ఉన్న నిధులు మేరకు మంచి స్వపరిపాలన అందించాలని కోరారు. ఈసందర్భంగా గెలుపొందిన సర్పంచ్‌లను పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

తాజా ఫోటోలు

Back to Top