హామీల‌ అమ‌లులో చంద్ర‌బాబు విఫ‌లం

విశాఖ‌:  ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌ని మాజీ రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్‌బాబు విమ‌ర్శించారు.  విశాఖ జిల్లా పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర లో వైయ‌స్‌ జ‌గ‌న్ స‌మ‌క్షంలో పార్టీలో చేరిన ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. విశాఖ‌ రైల్వేజోన్‌, ప్ర‌త్యేక‌హోదా, దుగ్గ‌రాజు ప‌ట్నం పోర్టు ,క‌డ‌ప స్టీల్‌ప్లాంట్  తీసుకురాలేక‌పోయార‌ని దుయ్య‌బ‌ట్టారు.  ఆర్థికంగా వెనుక‌బ‌డిన ఆంధ్ర‌కు  కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక హోదా ఇవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.ఇందుకోసం వైయ‌స్ జ‌గ‌న్ పోరాడుతున్న స్ఫూర్తి త‌న‌కు న‌చ్చి పార్టీలో చేరాన‌ని పేర్కొన్నారు.  ప్ర‌జ‌ల క‌ష్టాలు తీరాలంటే వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అవ్వాల‌న్నారు. రాజ‌న్న రాజ్యం జ‌గ‌న‌న్న‌తోనే సాధ్య‌మ‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.
Back to Top